: పొరుగుదేశంలోనూ కలెక్షన్ల 'కిక్' తప్పదంటున్నారు!


కండలరాయుడు సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న పాకిస్థాన్ లో సైతం ఈ సినిమా దూసుకెళ్ళడం ఖాయమని అక్కడి సినీ వర్గాల టాక్. నదీమ్ మండీవాలా అనే ఫిలిం డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ, వారం రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతుందని అన్నారు. ప్రీవ్యూ ప్రదర్శనలకు ప్రేక్షకులు పోటెత్తారని తెలిపారు. కాగా, 'కిక్'... 'ఇట్స్ ఎంటర్ టైన్ మెంట్' సినిమా కంటే పది రోజుల ముందే విడుదల అవడం కలిసొచ్చే అంశమని మండీవాలా అభిప్రాయపడ్డారు. అక్షయ్ కుమార్ నటించిన ఆ సినిమా వచ్చేలోపు కిక్ ఊపేస్తుందని తెలిపారు. అయితే, కిక్ సినిమాకు 'డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్', 'హెర్క్యులస్' వంటి హాలీవుడ్ సినిమాలు గట్టిపోటీనిస్తాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News