: రుణమాఫీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, ఉన్నతాధికారులతో పాటు పదకొండుమందితో రుణమాఫీపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ సమావేశానికి హాజరైంది. మాఫీపై విధివిధానాలను ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.