: జలసౌధ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు
హైదరాబాదులోని జలసౌధ కార్యాలయంలో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆఫీసులో పావుగంట సేపు కూర్చున్న మంత్రి దస్త్రాలను పరిశీలించారు. దాదాపు నాలుగోవంతు ఉద్యోగులు సమయానికి కార్యాలయానికి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోతే ఫైళ్ల క్లియరెన్స్ ఆలస్యం అవుతుందని, అందరూ టైమ్ కి రావాలని చెప్పారు.