: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా... భద్రతాదళాలపై దాడిచేసిన కాశ్మీర్ యువకులు
జమ్మూకాశ్మీర్ లో కొందరు ఆందోళనకారులు భద్రతాదళాలతో ఘర్షణకు దిగారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ... కాశ్మీర్ లోని భద్రతాదళాలతో ఆందోళనకారులు కయ్యానికి కాలుదువ్వారు. కాశ్మీర్ లో సోమవారం ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే గుంపులుగా రోడ్లపైకి వచ్చిన యువకులు భద్రతాదళాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో... పోలీసులు రంగంలోకి దిగి బాష్పవాయువు ప్రయోగించారు.