: ఫ్లిప్ కార్ట్ లో జియోమీ రికార్డ్ విక్రయం


చైనా యాపిల్ ఐఫోన్ గా పేరుపడిన జియోమీ ఎంఐ3 ఆన్ లైన్ విక్రయాల్లో రికార్డులను బద్దలుకొట్టింది. వినియోగదారులు ఎగబడటంతో కేవలం 5 సెకన్లలోనే విక్రయాలు పూర్తి అయ్యాయని జియోమీ తయారీ సంస్థ, సదరు విక్రయాన్ని నిర్వహించిన ఫ్లిప్ కార్ట్ వెల్లడించాయి. యాపిల్ ఐఫోన్ లోని దాదాపు అన్ని అంశాలతో విడుదలవుతోందన్న ప్రచారం నేపథ్యంలో వినియోగదారులు జీయోమీ పట్ల అమితాసక్తి ప్రదర్శించారు. ఇటీవల ఇదే స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లోనే విక్రయించగా, కేవలం రెండు గంటల్లోనే వినియోగదారులు స్టాకంతటినీ కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా జియోమీతో పాటు ఫ్లిప్ కార్ట్ సర్వర్లు స్తంభించిపోయాయి. తాజాగా మంగళవారం మరోమారు విక్రయాలకు తెరలేవగా, రెండు నిమిషాల్లోనే స్టాకంతా అమ్ముడుపోయిందని ప్రకటించిన జీయోమీ, మరికొద్దిసేపటికే ఆ ప్రకటనను సవరిస్తూ కేవలం 5 సెకన్లోనే విక్రయాలు మొత్తం పూర్తయ్యాయని తెలిపింది. ఫోన్ కావాలనుకునే వారు ఆగస్టు 5న నిర్వహించనున్న మూడో విక్రయం వరకూ ఆగాల్సిందేనని జీయోమీ తెలిపింది. రూ.50 వేల ధరతో మార్కెట్ ను విశేషంగా ఆకర్షించిన ఐఫోన్ ఫీచర్లతో కేవలం రూ.13,000లకే చౌక ధరలో ఫోన్ అందిస్తామని జియోమీ చెప్పడంతో వినియోగదారులు ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News