: కారు టాప్ పైన అర్ధనగ్నంగా కూర్చుని... జాతీయపతాకాన్ని ఆచ్చాదనగా కప్పుకున్న మల్లికా


సెక్సీ క్వీన్ మల్లికా షెరావత్ మరో వివాదానికి తెర లేపింది. మల్లికా షెరావత్ హీరోయిన్ గా నటిస్తున్న 'డర్టీ పాలిటిక్స్' పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయ్యింది. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో మల్లికా షెరావత్ రాజస్థాన్ అసెంబ్లీకి ఎదురుగా... ఓ కారు టాప్ పైన అర్థనగ్నంగా కూర్చుని... తన శరీరంపై కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే కప్పుకుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో మల్లిక జాతీయపతాకాన్ని చీరలా అభ్యంతరకరంగా ధరించినట్లు ఈ సినిమా ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోందని హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త ధన్ పాల్ రావు పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని అవమానపరిచేలా దృశ్యాలు డర్టీ పాలిటిక్స్ లో చిత్రీకరించారని... అందువలన ఈ చిత్రాన్ని నిలిపివేయాలని ఆయన హైదరాబాద్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

  • Loading...

More Telugu News