: కష్టాల్లో టీమిండియా... ఫాలో ఆన్ దాటుతుందా?
ఇంగ్లండ్ తో సౌతాంప్టన్ లో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత జట్టు కష్టాల్లో పడి ఎదురీదుతోంది. మూడో రోజు టీమిండియా బ్యాట్స్ మన్ కు ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు తీసి భారత టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. దీంతో భారత ఆటగాళ్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టారు. ఇంగ్లీష్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మన్ ను కట్టడి చేయడంతో మురళీ విజయ్(35), పూజారా(24),విరాట్ కోహ్లి(39),రోహిత్ శర్మ(28) పరుగులు మాత్రమే చేయగలిగారు. అజింక్యా రహానే (54) బాధ్యతాయుతంగా ఆడడంతో అర్ధసెంచరీ సాధించాడు. ఈ టెస్టులో ఇప్పటికి ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. జడేజా (31) పరుగులకే అవుటవ్వడంతో ధోనీ (26)కి జతగా భువనేశ్వర్ కుమార్ దిగాడు. దీంతో ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ 274 పరుగులతో ఫాలో ఆన్ అంచున నిలిచింది. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. టీమిండియా రిధమ్ అందుకుంటే తప్ప ఓటమిని ఆపడం అసాధ్యం.