: కాంస్యం దక్కించుకున్న మానవ్ జిత్ సంధు
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు షూటింగ్ పతకాల పంట పండించింది. తాజాగా మానవ్ జిత్ సంధు 25 మీటర్ల ర్యాపిడ్ ఎయిర్ పిస్టల్ అంశంలో కాంస్యపతకం సాధించారు. ఆస్ట్రేలియా షూటర్ మైకేల్ డైమండ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా చెదిరిపోని ఏకాగ్రతతో మానవ్ జిత్ సంధు కాంస్యపతకం సాధించడం విశేషం. ఇదే అంశంలో హర్ ప్రీత్ సింగ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.