: విశాఖ నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీకి మరిన్ని విమాన సర్వీసులు
విశాఖపట్టణం నుంచి మరిన్ని విమానాలు నడపాలని స్పైస్ జెట్ సంస్థ నిర్ణయం తీసుకుంది. విశాఖ-చెన్నై, విశాఖ-బెంగళూరు మధ్య సెప్టెంబర్ 1 నుంచి విమానాలు నడపాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పైస్ జెట్ వెల్లడించింది. అలాగే ఆగస్టు 3 నుంచి విశాఖ-హైదరాబాద్-ఢిల్లీ మధ్య ఇండిగో సంస్థ విమానాన్ని నడపనుందని ఎయిర్ ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షుడు వరదారెడ్డి తెలిపారు. విశాఖ నుంచి వివిధ నగరాలకు విమానాలు నడిపేందుకు మరిన్ని విమానయాన సంస్థలు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.