: ఆగస్టు 8, 9, 10 తేదీల్లో తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు
శ్రావణమాసం సందర్భంగా ఆగస్టు 8, 9, 10 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. అలాగే, ఆగస్టు 15, 16, 17 తేదీల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు జేఈవో చెప్పారు. త్వరలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.