: తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించిన సతీష్ శివలింగం భోజనం ఇదే
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించిన తమిళనాడు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం 'పవర్' రహస్యాన్ని ఆయన తండ్రి ఎన్ శివలింగం వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశానికి పతకం అందించేందుకు కఠోరసాధన చేశాడని తెలిపారు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకున్నాడని తెలిపారు. ప్రతి రోజు ఉదయం రెండు ఆమ్లెట్లతో పాటు నాలుగు ఇడ్లీలు తీసుకునేవాడట, మధ్యాహ్నం పావుకిలో చికెన్ తో భోజనం, రాత్రి అరలీటర్ పాలు తీసుకునేవాడట. వారంలో ఒకరోజు మధ్యాహ్న భోజనంతో నాణ్యమైన మటన్ ఉండాల్సిందేనని ఎన్ శివలింగం తెలిపారు. బలవర్థకమైన ఆహారం తీసుకోవడం వల్లే శరీరానికి శక్తి అందుతుందని, తన కుమారుడు అలాగే పతకం సాధించాడని వీఐటీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఎన్ శివలింగం వివరించారు.