: మలింగ నిర్ణయం పక్కా కమర్షియల్
ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్ ఓ ప్రభంజనం. దాని ధాటికి టెస్టు క్రికెట్ పునాదులు సైతం కదిలిపోయాయి. ఆటగాళ్ళ సంగతి సరేసరి. స్వదేశానికి చెందిన జట్లను సైతం విస్మరించి లీగ్ జట్లలో ఆడేందుకు మొగ్గుచూపుతున్నారు. తాజాగా, శ్రీలంక ప్రధాన బౌలర్ లసిత్ మలింగ తీసుకున్న నిర్ణయమే అందుకు నిదర్శనం. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో పాల్గొనే శ్రీలంక దేశవాళీ జట్టుకు ఆడబోనని, ముంబయి ఇండియన్స్ కే తన మొగ్గు అని ప్రకటించాడు. ఈ టోర్నీ సెప్టెంబర్ లో జరగనుంది. ఇందులో లంక నుంచి సదరన్ ఎక్స్ ప్రెస్ జట్టు పాల్గొంటోంది. తాము సదరన్ ఎక్స్ ప్రెస్ జట్టుకు ఆడమని కోరినా మలింగ అంగీకరించలేదని శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి నిశాంత రణతుంగ తెలిపారు. కాగా, మలింగ నాయకత్వంలో సదరన్ ఎక్స్ ప్రెస్ జట్టు సూపర్ 4 టి20 చాంపియన్ షిప్ లో జయకేతనం ఎగరవేయడం విశేషం.