: బీహార్ ఉప ఎన్నికల్లో వారసులకు నో చాన్స్: బీజేపీ కఠిన నిర్ణయం


వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికేందుకు బీజేపీ సమాయత్తమైంది. బీహార్లో జరగనున్న ఉప ఎన్నికల సందర్బంగా పార్టీ నేతల కుమారులెవ్వరూ పోటీచేయరాదని పార్టీ తెలిపింది. 10 అసెంబ్లీ స్థానాలకు గాను ఆగస్టు 21న ఉప ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ వెలువడింది. అయితే, వాటిలో నాలుగు స్థానాల్లో ఇంతక్రితం గెలిచిన నేతలు తాజాగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. దీంతో, తమ అడ్డాలో మరొకరు పాగా వేయడం ఇష్టంలేని ఆ నలుగురు నేతలు తమ పుత్రరత్నాలను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మొదటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బంధుప్రీతికి తావివ్వరాదని స్పష్టంగా చెబుతుండడంతో బీజేపీ అధినాయకత్వం ఆ నలుగురికి అడ్డుకట్ట వేసేలా ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News