: శివసేన గొంతు నొక్కేస్తున్నారంటున్న ఉద్ధవ్ థాకరే


శివసేన పార్టీకి ఇతర మతాల పట్ల ఎటువంటి ద్వేషం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. అయితే, తమ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఢిల్లీలోని ఓ క్యాంటీన్ లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ శివసేన ఎంపీలు అక్కడున్న వ్యక్తికి బలవంతంగా రోటీ తినిపించేందుకు ప్రయత్నించారు. అయితే, సదరు వ్యక్తి ముస్లిం కావడంతో అతడి ఉపవాసదీక్ష భగ్నం చేశారంటూ వస్తున్న ఆరోపణలపై థాకరే పైవిధంగా స్పందించారు. హిందుత్వ వాదులుగా ఉన్నప్పటికీ ఇతర మతాల పట్ల తమకు ద్వేషభావం లేదన్నారు. అటు ఈ ఘటనపై ఈ రోజు లోక్ సభలో ఆందోళన జరిగింది. కాగా, క్యాంటీన్ వ్యక్తి ముస్లిం అని తమకు తెలియదని, క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ శివసేన ఎంపీ రాజన్ విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News