: పరిగెడుతూనే ఉండండి... మృత్యువు మిమ్మల్నందుకోలేదు!


కొందరికి నడక, మరికొందరికి పరుగు ఎంతో ఆరోగ్యదాయకం. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను రోజూ నడవమని, ఆరోగ్యవంతులు రోజూ పరుగు తీస్తే మంచిదని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. కొద్ది నిమిషాలపాటైనా రోజూ పరిగెడుతూ ఉంటే కార్డియో వాస్కులార్ వ్యాధుల ముప్పు పెద్దగా ఉండదంటున్నారు. ఇందుకోసం పరిశోధకులు 55,137 మందిపై అధ్యయనం చేపట్టారట. వారిలో 18 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ వయస్కుల వరకు ఉన్నారు. ఇలా పదిహేనేళ్ళ పాటు పరిశీలించాక పరుగుకు, దీర్ఘాయుష్షుకు సంబంధం ఉందని ఓ అభిప్రాయానికి వచ్చారు. అధ్యయనం జరుగుతున్న కాలంలో 3,413 మంది చనిపోగా, వారిలో 1,217 మంది హృదయ సంబంధ వ్యాధులతోనే మరణించారట. ఇక, రోజూ పరుగు తీసే వ్యక్తులు ఏమీ పరిగెత్తని వ్యక్తుల కంటే సగటున మూడేళ్ళు అదనంగా బతుకుతారట. ఇంకెందుకాలస్యం, ఓ పరుగు తీస్తే పోలా..!

  • Loading...

More Telugu News