: కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లో... విద్యుదుత్పత్తికి బ్రేక్
వరంగల్ జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఘనపూర్ మండలంలోని చెల్పూర్ లో ఉన్న ఈ పవర్ ప్లాంట్ కు చేరుకున్న ఇంజనీర్లు మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు. మంగళవారం రాత్రిలోపు మరమ్మతు పనులను పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పునరుద్ధరిస్తామని ప్లాంట్ వర్గాలు తెలిపాయి.