: సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ గా కేసీఆర్


సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ కౌన్సిల్ కు ఛైర్మన్ గా కేంద్ర హోంమంత్రి వ్యవహరిస్తారు. దక్షిణాది రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా వైస్ ఛైర్మన్ వ్యవహరిస్తారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడానికి ఈ కౌన్సిల్ ఓ వారధిలా పనిచేస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడం, జాతీయ సమగ్రతను మరింత పటిష్ఠ పరచడం, వివిధ అంశాలపై రాష్ట్రాల ఆలోచనలు, అనుభవాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఈ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశాలు. సదరన్ జోనల్ కౌన్సిల్ లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఉన్నాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ఆయన ఈ పదవిని చేపట్టడం గమనార్హం.

  • Loading...

More Telugu News