: అక్రమ వెబ్ సైట్లలో పోలీసు వారి ప్రకటనలు


లండన్ పోలీసులు పైరసీకి ఊతమిచ్చే వెబ్ సైట్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా వెబ్ సైట్ల బ్యానర్లలో తమ ప్రకటనలు పొందుపరిచారు. 'ఈ సైట్ పై పోలీసులకు ఫిర్యాదు అందినది' అన్నదే ఆ ప్రకటనల సారాంశం. ఈ ప్రకటనలతో సదరు సైట్ల జోలికి ఎవరూ వెళ్ళరన్నది లండన్ పోలీసు విభాగం ఉద్దేశం. వాణిజ్య ప్రకటనల ద్వారా వారికి ఆదాయం రాకుండానూ ఈ విధానం ద్వారా గండికొట్టవచ్చన్నది పోలీసుల ఆలోచన. తమ ప్రకటన చూసి ప్రఖ్యాత బ్రాండ్లేవీ ఆ అక్రమ వెబ్ సైట్లకు ప్రకటనలు ఇవ్వబోవని వారు విశ్వసిస్తున్నారు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించే చాలా వెబ్ సైట్లు అడ్వర్టయిజ్ మెంట్ల ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నాయి. ఆ మార్గాన్ని దెబ్బతీస్తే ఇక ఆ సైట్లు మూతపడిపోతాయని లండన్ పోలీస్ విభాగం భావిస్తోంది.

  • Loading...

More Telugu News