: కొలీజియం వ్యవస్థ పూర్తిగా విఫలమైంది: జస్టిస్ మార్కండేయ కట్జూ


న్యాయవ్యవస్థలోని అవినీతిపై కొన్ని రోజుల కిందట మాట్లాడిన భారత ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ ఇప్పుడు కొలీజియంపై దండెత్తారు. ఈ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జడ్జీలను నియమించే ముందు ఏడుగురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్ (కొలీజియం) ముందుగా కొంత పరిశీలన చేస్తే... ఆ తర్వాత వారిపై ఓ అభిప్రాయానికి రావొచ్చని పేర్కొన్నారు. అంతేగాక ప్రజలు చూసేలా పారదర్శకత పాటిస్తూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని, సరైన అభ్యర్థిని పిలిచి ప్రశ్నించాలనీ అన్నారు. గతంలో ఆయన హైకోర్టు జడ్జిగా పనిచేసినప్పటి విషయాలను, వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చెప్పారు. ఎలాంటి వ్యక్తిని జడ్జిగా నియమిస్తున్నారో ప్రజలకు తెలుసుకునే హక్కుందని కట్జూ అన్నారు.

  • Loading...

More Telugu News