: కామన్వెల్త్ పోటీలు వదిలేసి పడతుల వెంటపడ్డాడు!
కామన్వెల్త్ క్రీడల సందర్భంగా పపువా న్యూగినియాకు చెందిన తౌవా ఉదియా (22) అనే లిఫ్టర్ చిక్కుల్లో పడ్డాడు. ఈ క్రీడలకు వేదికైన గ్లాస్గో నగరంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఈ లిఫ్టర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దీనిపై గ్లాస్గో షెరిఫ్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా తౌవా తనపై ఆరోపణలను అంగీకరించలేదని, తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. కిందటి సోమవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. తమకందిన ఫిర్యాదు మేరకు ఆ లిఫ్టర్ ను అరెస్టు చేశామని చెప్పారు. కాగా, "మార్కెట్ వద్ద సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది. నా ప్రతిష్ఠకు భంగం కలగాలని కోరుకోను" అని తౌవా పేర్కొన్నట్టు ఆస్ట్రేలియా ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా తెలిపింది.