: 'కామన్వెల్త్' పతకం కళ్ళు చెదిరే నజరానా తెచ్చిపెట్టింది!
బ్రిటన్లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న 20వ కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్ అంశంలో తమిళనాడు లిఫ్టర్ సతీశ్ కుమార్ శివలింగం స్వర్ణం సాధించడం తెలిసిందే. దీనిపై సతీశ్ సొంత రాష్ట్రం తమిళనాడులో సంబరాలు జరుపుకుంటున్నారు. సతీశ్ అమోఘ ప్రదర్శన సీఎం జయలలితను కూడా ఆకట్టుకుంది. వెంటనే అతనికి రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించడం ద్వారా దేశంతో పాటు రాష్ట్రం కూడా గర్వించేలా చేశావని సతీశ్ ను జయ అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న తొలి ఈవెంట్లోనే సతీశ్ బంగారు పతకం గెలవడం చిరస్మరణీయమని పేర్కొన్నారు.