: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీ ఎక్సైజ్ శాఖ మంత్రి


హైదరాబాదు చిలకలగూడ ఈద్గాలో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. మరోవైపు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News