: బాంబే ఐఐటీ క్యాంపస్ లో చిరుత
బాంబే ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్ లో ఈ రోజు అకస్మాత్తుగా చిరుతపులి ప్రవేశించింది. అదింకా తమ క్యాంపస్ ప్రాంగణంలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్యాంపస్ లో ఈ ఉదయం మెటలర్జీ శాఖ (లోహశోధన శాఖ) వర్క్ షాప్ జరుగుతుండగా పలువురు చిరుతను చూశారు. భయంతో అటవీ అధికారులకు తెలిపారు. వెంటనే క్యాంపస్ కు చేరుకుని వారు చిరుతకోసం గాలిస్తున్నారు. తమ క్యాంపస్ లో స్టాఫ్ మెంబర్ చిరుతను చూసి అందరికీ చెప్పాడని, అప్పట్నుంచి అలర్ట్ అయ్యామని పబ్లిక్ రిలేషన్స్ అధికారిణి తెలిపారు. అయితే, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు.