: మరింత బలపడనున్న అల్పపీడనం... పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ సాయంత్రానికి మరింత బలపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తా, తెలంగాణల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని... రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పారు. తీరప్రాంతం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.