: సుష్మా, రాజ్ నాథ్ లపైనా నిఘా?


బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇంటిలో వాయిస్ రికార్డింగ్ తరహా నిఘా పరికరాలు లభ్యమయ్యాయన్న అంశంపై రేగిన కలకలం సర్దుమణగక ముందే, ఆ తరహాలోనే ఆ పార్టీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ లపైనా నిఘా కన్నేసిందన్న వార్తలు వెలుగు చూశాయి. దీంతో కేంద్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. దీనిపై ప్రధాని నోరువిప్పకపోవడం ఆశ్చర్యంగొలుపుతోందని కాంగ్రెస్ మండిపడింది. ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ మౌనం పాటించారని నిత్యం విమర్శలు గుప్పించిన మోడీ, ఇప్పుడెందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ గోహిల్ ఆరోపించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు వ్యక్తులపై నిఘా పెట్టిన మోడీ చర్యలను గోహిల్ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. "మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్ లో ఈ ఘటనలు సర్వసాధారణంగా జరిగేవి. తాజాగా ఈ సంస్కృతి ఢిల్లీకి కూడా పాకింది" అని ఆయన ఆరోపించారు. గతవారం గడ్కరీ నివాసంలో వాయిస్ రికార్డింగ్ పరికరాలు లభ్యమైన విషయాన్ని బీజేపీ నేత అరుణ్ శౌరి పత్రిక ‘ద సండే గార్డియన్’ ప్రచురించింది. అయితే ఈ వార్తలను గడ్కరీ తోసిపుచ్చిన నేపథ్యంలో ఎలాంటి విచారణ అవసరం లేదని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. తాజాగా తనపైనే నిఘా జరిగిందన్న వార్తలపై రాజ్ నాథ్ ఎలా స్పందిస్తారో మరి!

  • Loading...

More Telugu News