: చేపల కోసం వల వేస్తే... మొసలి పడింది
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం రామన్ పాడు రిజర్వాయర్ లో రైతులు చేపల కోసం వల వేయగా... వారికి మొసలి చిక్కింది. వల వేసిన తరువాత కొంతసేపటికి బాగా బరువుగా ఉండడంతో... రైతులకు మొదట్లో ఏం పడిందో అర్థం గాలేదు. అయితే చివరికి వలను బయటకు లాగినప్పుడు మొసలి కనపడడంతో వారు భయభ్రాంతులకు గురయ్యారు. రైతులు వెంటనే మెుసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.