: వైట్ హౌస్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తాం: ఉత్తర కొరియా వార్నింగ్


అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తరకొరియా డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచి పోషిస్తోందని ఆరోపిస్తూ... దుశ్చర్యలను మానుకోవాలని సూచించింది. పద్ధతి మార్చుకోకపోతే వైట్ హౌస్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించింది. 1950-53 కొరియా యుద్ధం ముగిసిన రోజును పురస్కరించుకుని... సైనికులను ఉద్దేశించి ఉత్తరకొరియా మిలిటరీ జనరల్, పొలిటికల్ బ్యూరో డైరెక్టర్ వాంగ్ ప్యొంగ్ సొ ప్రసంగిస్తూ ఈ హెచ్చరిక చేశారు. అణ్వస్త్రాలతో కూడిన విమానవాహక నౌకను కొరియాతీరంలో మోహరించి... దక్షిణకొరియాతో కలసి అమెరికా సైనిక విన్యాసాలను నిర్వహించడం తమను రెచ్చగొట్టేలా ఉందని మండిపడ్డారు. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే రీతిలో వ్యవహరిస్తే వైట్ హౌస్, పెంటగాన్ లపై అణ్వాయుధ దాడులకు తెగబడతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News