: నారాయణపూర్ డ్యాం నిండింది... జూరాలకు నీరు వస్తోంది
ఆల్మట్టి డ్యాం నుంచి వచ్చిన వరదనీటితో కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నిండింది. నారాయణపూర్ లో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి చేరడంతో సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో 12 గేట్లను ఎత్తివేసి... 38 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ నీరు మంగళవారం సాయంత్రానికి తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటుందని జూరాల డ్యాం అధికారులు తెలిపారు.