: బీహార్ లో 13 వేల డిటోనేటర్ల పట్టివేత
బీహార్ లోని ఓ గ్రామంలో దాచిపెట్టిన 13,900 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోహ్ తాన్ జిల్లాలోని వాసా అనే గ్రామంలో ఎస్పీ చందన్ కుమార్ మాట్లాడుతూ... సాధారణంగా క్వారీయింగ్ లో వీటిని వినియోగిస్తారని, అయితే మావోయిస్టులకు అందుతున్నాయన్న పక్కా సమాచారంతో దాడి చేసి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తును చేస్తున్నామని ఆయన అన్నారు.