: ప్రముఖ నిర్మాత, దర్శకుడికి నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ బెడద
ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత మహేష్ భట్ పేరిట ఎవరో ఆగంతుకుడు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ తెరిచాడు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా నలిగి మహేష్ భట్ చెవిన పడింది. దీనిపై ఆయన వెంటనే ట్విట్టర్లో స్పందించారు. "కొందరు నా పేరుపై ఫేస్ బుక్ లో ఖాతా తెరచి అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయంలో అభిమానులు అప్రమత్తంగా ఉండాలి" అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఆయన కుమార్తె, యువ నటి అలియా భట్ కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. దీంతో తనకు ఫేస్ బుక్ అకౌంటే లేదని అలియా స్పష్టం చేసింది.