: నీటిపారుదల రంగంపై నాలుగో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. హైదరాబాదులో ఇవాళ (సోమవారం) నీటిపారుదల రంగంపై బాబు శ్వేతపత్రం విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించినా పొలానికి నీరందించలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లుగా నిధులు వెచ్చించినా... ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయారని చంద్రబాబు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ రంగంలో అడ్డగోలుగా వ్యవహరించారని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు లక్షా 90 వేల 500 కోట్ల రూపాయల అంచనాలు రూపొందించారని... అయితే కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేకపోయారని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగమయ్యాయని సీఎం చెప్పారు.