: ముస్లిం ఓట్ల కోసమే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా: బీజేపీ
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడంపై టీ బీజేపీ విమర్శిస్తోంది. పాకిస్థాన్ ఇంటి కోడలైన సానియాను తెలంగాణ రాష్ట్రానికి అంబాసిడర్ గా ప్రకటించారని బీజేపీ నేత, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ అన్నారు. అలాగే నవాబ్ అలీ జంగ్ జయంతిని 'ఇంజనీర్స్ డే'గా ప్రకటించారని గుర్తు చేశారు. అటు ఎంఐఎం మెప్పు కోసమే చార్మినార్ చిహ్నాన్ని తెలంగాణ రాజముద్రలో చేర్చారని ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్ పై నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యలను ఈ సమయంలో లక్ష్మణ్ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.