: ఆఫీస్ లో మంచి నీళ్లు తాగుతున్నారా?... అయితే, ఇది మీ కోసమే!
ఆఫీస్ లో మంచి నీళ్లు తాగుతున్నారా? అయితే ఓసారి ఈ కథనం చదవాల్సిందే. మీ ఆఫీసులో పని చేసే వాటర్ ప్యూరిఫయర్ ఎన్నాళ్లకోసారి కడుగుతున్నారు? మీకు సప్లై చేసే వాటర్ బబుల్ ఎంత శుభ్రంగా ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా? ముంబైలో ఎంజీఎం స్కూల్ ఆఫ్ హెల్త్ మేనేజ్ మెంట్ చేసిన అధ్యయనంలో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. ఇవి మెట్రో నగరాలన్నింటికీ వర్తిస్తాయని సర్వే పేర్కొంది. మొత్తం ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్లను ఏడాదిలో ఒక్కసారే శుభ్రం చేస్తారట. దీని కారణంగా 92 శాతం ఉద్యోగులు నీటి వల్ల కలిగే జీర్ణకోశ వ్యాధులతో బాధపడుతున్నారట. జీవితంలో ఎక్కువ కాలం గడిపే ఆఫీసుల్లో మంచి బ్రాండ్ల నీటిని, ఖరీదైన ప్యూరిఫయర్లను వాడుతారు కానీ వాటి నాణ్యతను పట్టించుకోరని సర్వే వెల్లడించింది. దీనివల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు చుట్టుముడుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. శుభ్రం చేసే వారు కూడా ఓ మోస్తరు శుభ్రత పాటిస్తారని సర్వే తెలిపింది.