: ఆ స్కూల్ ఛైర్మన్ అరెస్టు


గత వారం రోజులుగా బెంగళూరును నిద్రపోనివ్వకుండా చేసిన విబ్జియార్ పాఠశాల ఛైర్మన్ రుస్తుం కేరావాలను పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం నిందితుడి వ్యవహార శైలిపై సరైన విచారణ జరపకుండా ఉద్యోగంలో నియమించినందుకు, బాలికను రక్షించడంలో విఫలమైనందుకు, అత్యాచార ఘటనను దాచిపెట్టాలని చూసినందుకు పాఠశాల ఛైర్మన్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ముస్తఫా గతంలో కూడా ఇదేతరహా నేరాలు చేసి బహిష్కరణకు గురయ్యాడని పోలీసులు వెల్లడించారు. ముస్తఫా ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిలో పిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి స్కూలు పునఃప్రారంభమవుతుందని, ఆ లోపు సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. స్కూల్ ప్రిన్సిపాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తామని వివరించారు.

  • Loading...

More Telugu News