: సారాకు సినిమాల ఆలోచన లేదు... అన్నీ పుకార్లే: కరీనా
సైఫ్ అలీఖాన్ కుమార్తె సారాఖాన్ కు సినిమాల్లో నటించే ఆలోచన లేదని ఆమె పినతల్లి కరీనా కపూర్ తెలిపింది. బాలీవుడ్ లో సారాఖాన్ నటించనుందనే ప్రచారం గత కొద్ది రోజులుగా ఊపందుకుంది. సారా సినీరంగ ప్రవేశంపై రోజుకో కథనాలు పత్రికలు, టీవీల్లో ప్రచారం అవుతుండడంతో కరీనా కపూర్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి సారాకి సినిమాల్లో నటించే ఆలోచన లేనే లేదని తేల్చి చెప్పింది. కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న సారా విద్య పూర్తికావడానికి మరో ఐదేళ్ల సమయం పడుతుందని కరీనా స్పష్టం చేసింది. తాను నటిస్తున్న 'సింగం రిటర్న్స్' సినిమా ఘనవిజయం సాధిస్తుందని కరీనా తెలిపింది. కాగా, సారా తల్లికి విడాకులిచ్చిన తరువాతే కరీనాను సైఫ్ అలీఖాన్ వివాహం చేసుకున్నాడు.