: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పరువు కాపాడింది ఆ రెండు ఆటలే!
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశ పరువు ప్రతిష్ఠలు నిలబెట్టిన క్రీడాంశాలు షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ కావడం విశేషం. దీంతో భారత్ పతకాల పట్టికలో టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించింది. షూటర్లు విశేషంగా రాణించడంతో పతకాల పంట పండింది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత లిఫ్టర్లు అంచనాలకు మించి రాణించడంతో భారతదేశ ప్రతిష్ఠ ఇనుమడించింది. ఇప్పటి వరకు భారత్ 22 పతకాలు సాధించగా, షూటింగ్ లో 3 స్వర్ణాలు, 5 రజతాలు, ఒక కాంస్య పతకం గెలుచుకుని భారత షూటర్లు సత్తా చాటారు. 3 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యపతకాలతో భారత్ లిఫ్టర్లు దేశప్రతిష్ఠను పైకెత్తారు. ఎన్నో అంచనాలు, ఆశలతో వెళ్లిన షట్లర్లు మాత్రం నిరాశపరిచారు. రెజ్లింగ్, బాక్సింగ్ ఫైనల్స్ ఇంకా జరగాల్సి ఉంది. రెజ్లర్లలో భారత్ మంచి రికార్డు కలిగి ఉండగా, బాక్సింగ్ లో భారత బాక్సర్లు మంచి ఫాంలో ఉన్నారు. దీంతో ఈ రెండు క్రీడాంశాల్లో పతకాల పంటపండే అవకాశం ఉంది.