: యశోదా ఆసుపత్రి నుంచి ఏడుగురు చిన్నారుల డిశ్చార్జి


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో గాయపడి... సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారుల్లో ఏడుగురిని ఇవాళ (సోమవారం) డిశ్చార్జి చేసినట్లు డాక్టర్లు చెప్పారు. మరో ఏడుగురు విద్యార్థులను రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వారు తెలిపారు. ఇద్దరు విద్యార్థుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, నలుగురు విద్యార్థులను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని వారు వెల్లడించారు. గత గురువారం నాడు మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో 14 మంది విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 20 మంది చిన్నారులు సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News