: అది 'కన్నడ టెర్రరిజం' అంటున్న శివసేన
కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రజలపై పోలీస్ దాడులను శివసేన తీవ్రంగా పరిగణిస్తోంది. అది కన్నడ టెర్రరిజం తప్ప మరొకటి కాదని ఆరోపించింది. పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబయిలో కర్ణాటక భవన్, కర్ణాటక సంఘ్ భవన్ కళకళలాడుతున్నాయని, కర్ణాటకలోని మహారాష్ట్ర బోర్డు వద్ద అలాంటి పరిస్థితి కనిపించడం లేదని శివసేన పేర్కొంది. మరాఠీ ప్రజలపై జరుగుతున్న దాడులు చూస్తే పాక్ ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్ సైతం సిగ్గుపడతాడని వ్యాఖ్యానించింది. ఇటీవలే మహారాష్ట్ర సదన్ లో ఓ ముస్లింకు బలవంతంగా రొట్టె తినిపించిన ఘటనపై ఎలుగెత్తిన పార్టీలు, కర్ణాటక పోలీసు దాడుల విషయంలోనూ అదే రీతిలో ఉత్సాహాన్ని ప్రదర్శించగలవా? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలని శివసేన కోరింది.