: ఆర్బీఐ రీషెడ్యూల్ అంటుంటే... బాబు రుణమాఫీ అంటారేమిటి?: వైవీ సుబ్బారెడ్డి
రైతు రుణమాఫీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఒంగోలులోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్బీఐ రీషెడ్యూలుకు అనుమతి ఇస్తే, బాబు రుణమాఫీ చేసేశానంటున్నారు. అదెలా సాధ్యమో ప్రజలకు స్పష్టత ఇవ్వకుంటే మరో ఉద్యమం పుట్టుకొస్తుందని ఆయన హెచ్చరించారు. అనుమతించిన పరిమితికి మించి పొగాకు పండిస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పెనాల్టీ విధానంపై ఆయన మాట్లాడుతూ, ఇలా పెనాల్టీ విధించే నిబంధనను రద్దు చేయాలని కేంద్ర వాణిజ్యమంత్రిని కోరతానని ఆయన పొగాకు రైతులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.