: విశాఖలో విరిగిపడిన కొండచరియలు.. పలు రైళ్ల రద్దు
విశాఖలోని కేకే లైన్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. జాస్తి-మిల్లిగూడ మధ్య కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సమలేశ్వరి, జగదల్ పూర్-దుర్గ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-కిరండోల్ ప్యాసింజరును కోరాపుట్ వరకే నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కేకే లైన్ లో రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనిలో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు.