: నిత్యానందకు నాన్ బెయిలబుల్ వారెంట్
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు చెన్నైలోని రామనాడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అతనిపై ఉన్న పలు కేసుల్లో ఓ కేసుకు సంబంధించి కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది. మరోవైపు వచ్చేనెల ఆరవ తేదీన పురుషత్వ పరీక్షలకోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి నిత్యానంద హాజరుకావాలని సీఐడీ అధికారులు ఆదివారం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.