: బైక్ రేసింగుల్లో పాల్గొంటే కేసులు పెడతాం: సీపీ ఆనంద్


18 సంవత్సరాల లోపు వయస్సున్న యువతకు ద్విచక్ర వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు పెడతామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. వీకెండ్ వస్తే చాలు... నగర యువత హైదరాబాదు రోడ్లపై బైక్ రేసుల్లో మునిగితేలుతోంది. ఈ నేపథ్యంలో... మొన్న హైదరాబాదు శివారు నార్సింగిలో బైక్ రేసింగుల్లో పాల్గొన్న 83 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలసిందే. వారికి సైబరాబాద్ సీపీ కౌన్సిలింగ్ నిర్వహించారు. బైక్ రేసింగుల్లో పాల్గొంటే... విద్యార్థులతో పాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News