: రంజాన్ పండుగ సందర్భంగా 50 స్పెషల్ బస్సులు ఏర్పాటు
మంగళవారం నాడు ఈద్ (రంజాన్) పండుగ సందర్భంగా ఆర్టీసీ 50 స్పెషల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈద్గాకు 50 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రకటించింది. రంజాన్ పండుగ సందర్భంగా రేపు నగరంలోని సిటీబస్ పాస్ కౌంటర్లు పనిచేయవని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.