: రైతులు ఓటు వేయరని జగన్ భయపడుతున్నారు: యనమల


వైకాపా అధినేత జగన్ పై ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. రుణమాఫీ వద్దని గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి కేంద్రానికి లేఖ రాశారని... రుణమాఫీ చేయలేమని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారని అన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయనుండటంతో... జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదని అన్నారు. భవిష్యత్తులో వైకాపాకు ఓట్లు పడవని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు చెందిన లక్షలాది ఎకరాలను ధనవంతులకు ధారాదత్తం చేసిన ఘనత జగన్ దే అని చెప్పారు. 10 ఛార్జ్ షీట్లలో జగన్ పై 420 కేసులున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News