: డైనోసార్లు ఆ విధంగా కన్నుమూశాయి!


భూమండలంపై కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన రాక్షల బల్లులను నేడు మనం శిలాజాల రూపంలో, అదీ, ఎంతో అరుదుగా చూస్తున్నాం. ఒకప్పుడు వాటిదే రాజ్యం. ఇప్పుడున్నంత జీవ వైవిధ్యం అప్పుడు లేకపోవడానికి ఈ డైనోసార్లే కారణం. తమ అపారబలంతో మరో జీవిని ఎదగకుండా చేశాయి. దీంతో, జీవకోటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నది. ఆ రాక్షస బల్లుల ప్రాభవం అలాగే కొనసాగి ఉంటే నేడు మనిషన్నవాడు భూమిపై ఉండేవాడు కాదేమో. కానీ, నేల రాలిన ఓ భారీ గ్రహశకలం డైనో యుగానికి చరమగీతం పాడింది. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటన అనంతరం రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఆ గ్రహశకలం భారీ వేగంతో నేలరాలిన సందర్భంగా సముద్రాల్లో సునామీలు వచ్చాయి. భూకంపాలు సంభవించాయి. తీవ్రస్థాయిలో ఉష్ణం వెలువడింది. ఆమ్ల వర్షాలూ కురిశాయి. ఆ గ్రహశకలం భూమిని తాకగా, అప్పుడు రేగిన ధూళి సూర్యుణ్ణి సైతం కప్పేసింది. ఆ ధూళి ఓ దుప్పటి మాదిరిగా భూవాతావరణం పైన నిలిచిపోయింది. తద్వారా సూర్యరశ్మి సోకక భూమి తాత్కాలికంగా చల్లబడిపోయింది. దీంతో, మొక్కలు జీవక్రియలకు ఆటంకం ఏర్పడి అవి చనిపోగా, వాటిపై ఆధారపడిన కొన్ని జంతువులు నాశనమయ్యాయి. ఇలా డైనోసార్లు కూడా కాలగర్భంలో కలిసిపోయాయని బ్రిటన్లోని ఎడింబర్గ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం మెక్సికో దేశం ఉన్న ప్రాంతంలో ఆ గ్రహశకలం భూమిని తాకినట్టు ఎడింబర్గ్ పరిశోధకులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News