: మాసాయిపేట ఘటన చిన్నారులకు నారా లోకేశ్ పరామర్శ
మెదక్ జిల్లా మాసాయిపేట స్కూల్ బస్సు ఘటనలో తీవ్ర గాయాలపాలై సికింద్రాబాదు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను టీడీపీ యువ నేత నారా లోకేశ్ పరామర్శించారు. ఆయన వెంట పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. పిల్లల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.