: త్వరలోనే 16 మంది విద్యార్థుల డిశ్చార్జ్: టీఎస్ డిప్యూటీ సీఎం


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు విద్యార్థులు సికింద్రాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. హాస్పిటల్ లో ఉన్న చిన్నారులను తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య ఈరోజు మరోసారి కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పిల్లలు బాగా కోలుకుంటున్నారని... త్వరలోనే 16 మందిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. డిశ్చార్జ్ అయిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు కామారెడ్డి నుంచి ఒక వైద్యుడిని నియమిస్తామని వెల్లడించారు. ఏమాత్రం ఎమర్జన్సీ ఉన్నా పిల్లలను మళ్లీ యశోదా ఆసుపత్రికి తరలించేలా సదరు వైద్యుడు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News