: భారత భూభాగంలోని లడక్ లో ప్రవేశించిన చైనా ఆర్మీ
చైనా మరోసారి భారత భూభాగంలోకి ప్రవేశించింది. జమ్మూకాశ్మీర్ లోని లడక్ ప్రాంతంలోకి చైనా సైనికులు అడుగుపెట్టారు. ఈ మేరకు అక్కడి డెంచోక్ ప్రాంతంలో చైనీస్ ఆర్మీ టెంట్లు ఏర్పాటుచేసుకుంది. బీజేపీ లడక్ ఎంపీ తుప్సన్ చ్ఛెవాంగ్ మాట్లాడుతూ, అక్కడి ప్రాంతంలోని సంచార జాతుల టెంట్లను నాశనం చేసేందుకు చైనా ప్రయత్నించిందని తెలిపారు. అయితే, ఇది చాలా తీవ్రమైన సమస్య అని, దీనిపై ఆ ప్రాంత సర్పంచ్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది.