: ఆరంగేట్రం టెస్టులోనే జరిమానాతో షాకిచ్చారు!


నిరోషన్ డిక్వెల్లా... శ్రీలంక కొత్త వికెట్ కీపర్. సీినియర్ ఆటగాడు కుమార సంగక్కర రిటైర్మెంట్ సమయం ఆసన్నం కావడంతో ప్రత్యామ్నాయాలను పరిశీలించే క్రమంలో ఈ యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నారు. అయితే, కెరీర్ తొలి టెస్టులోనే జరినామా దెబ్బ రుచి చూశాడు డిక్వెల్లా. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు సందర్భంగా ఈ 21 ఏళ్ళ వికెట్ కీపర్ అతిగా అప్పీల్ చేశాడని అంపైర్లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఓ క్యాచ్ విషయంలో డిక్వెల్లా అనైతికంగా ప్రవర్తించాడని వారు రిఫరీకి వివరించారు. దీంతో, ఈ వ్యవహారంపై విచారణ జరిపిన మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో... క్రికెట్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా ప్రవర్తించాడంటూ డిక్వెల్లా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించాడు. అంతేగాకుండా అధికారికంగానూ మందలించారు. సురంగ లక్మల్ బౌలింగ్ లో సఫారీ బ్యాట్స్ మన్ ఏబీ డివిల్లీర్స్ లెగ్ సైడ్ ఆడబోగా బంతి డిక్వెల్లా గ్లోవ్స్ లోకి చేరింది. దీనిపై అప్పీల్ చేయగా అంపైర్ బిల్లీ బౌడెన్ తిరస్కరించాడు. ఈ వ్యవహారంలోనే డిక్వెల్లాకు షాకిచ్చారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో డిక్వెల్లా 72 పరుగులతో రాణించడం విశేషం.

  • Loading...

More Telugu News