: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర తగ్గే అవకాశాలు!
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే ధోరణి మరో నాలుగు రోజులు కొనసాగితే పెట్రోల్ ధరను తగ్గించాలని ఆయిల్ కంపెనీలు దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. పెట్రోల్ ధరను ఒక రూపాయి వరకు తగ్గించాలని ఆయిల్ కంపెనీలు అనుకుంటున్నాయి. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్రప్రభుత్వంతో మాట్లాడిన తర్వాతే తీసుకుంటామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇదే గనుక జరిగితే ఏప్రిల్ తర్వాత తొలిసారి పెట్రోల్ ధరలు తగ్గించినట్లు అవుతుంది.